నాణ్యమైన విద్యకు తొలి ప్రాధాన్యత.. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

నాణ్యమైన విద్యకు తొలి ప్రాధాన్యత.. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట, వెలుగు: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నాణ్యమైన, రుచికరమైన పోషకాహారం, నాణ్యమైన విద్యను అందించాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని కేజీబీవీ, మోడల్ స్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్​వాడీ కేంద్రాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మెనూ ప్రకారం భోజనం అందుతున్నదో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రక్తహీనత ఉన్న బాలికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, 14 సంవత్సరాల లోపు బాలికలందరికీ హెచ్పీవీ వ్యాక్సిన్ వంద శాతం అందేలా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. అంగన్​వాడీ కేంద్రంలో చిన్నారుల పోషకాహార వివరాలు, గడువు తేదీలను పరిశీలించి నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని సూచించారు.