జనంపల్లి తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలు

జనంపల్లి తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఆకస్మకింగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, రుచికరమైన భోజనం అందించాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పంచాయతీరాజ్, గృహనిర్మాణ శాఖల అధికారులతో తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులపై సమీక్షించారు. స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.