గురుకుల ఎంట్రన్స్ హాల్ టికెట్లు రిలీజ్

 గురుకుల ఎంట్రన్స్ హాల్ టికెట్లు రిలీజ్
  • సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్–2026)కు హాల్ టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. 2026–27 అక డమిక్ ఇయర్ లో 5, 6 నుంచి 9 వ తరగతుల వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ సొసైటీలో ప్రవేశాల కోసం ఎంట్రన్స్ నిర్వహిస్తున్నామని గురువా రం పత్రిక ప్రకటనలో తెలిపా రు.

గురువారం నుంచి ఈ నెల 22 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని, అదే రోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుం దని పేర్కొన్నారు. గురుకులాల్లోని అన్ని క్లాసులకు కలిపి సుమారు 1.82 లక్షల అప్లికేషన్లు వచ్చాయని వెల్లడించారు. అభ్యర్థుల ఫోన్లకు సమాచారం ఇచ్చినట్టు వివరించారు.