మహీంద్రా నుంచి కొత్త ఈ-ఆటో.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు పరుగు

మహీంద్రా నుంచి కొత్త ఈ-ఆటో.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు పరుగు

మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ సంస్థ ఉడో పేరుతో  ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్​లో గురువారం విడుదల చేసింది. విమానం డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది దీనిని రూపొందించింది.  ఎక్స్​షోరూమ్​ ధర రూ.3.58 లక్షలు కాగా, కొంతకాలం తర్వాత రూ.3.84 లక్షలకు పెరుగుతుంది. 

ఉడోను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల దూరం ప్రయా ణిస్తుంది. ఇందులో 11.7 కిలోవాట్ల ఐపీ67 రేటెడ్ బ్యాటరీ, 10 కిలోవాట్ల పీఎంఎస్ మోటార్ వాడారు. డ్రైవర్ సౌకర్యం కోసం పైలట్ సీటు ఉంటుంది. జహీరాబాద్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో తయారయ్యే ఈ ఆటోపై ఆరేళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వారంటీ ఇస్తామని మహీంద్రా లాస్ట్​ మైల్​ ప్రకటించింది.