గోడలు ఎక్కే రోబోలు

గోడలు ఎక్కే రోబోలు
  • గోడలు ఎక్కే రోబోలు
  • అభివృద్ధి చేసిన సౌత్  కొరియా పరిశోధకులు
  • బ్రిడ్జిలు, నౌకలు, బిల్డింగ్ ల రిపేర్లలో సాయం చేస్తాయని వెల్లడి

సియోల్: గోడలు, సీలింగ్ రూఫ్ లు ఎక్కే కిల్లర్  రోబోలను సౌత్  కొరియా రిసర్చర్లు అభివృద్ధి చేశారు. ‘ద కొరియా అడ్వాన్స్ డ్ ఇన్ స్టిట్యూట్  ఆఫ్  స్సైన్స్  అండ్  టెక్నాలజీ’ లో ఆ రోబోలను డెవలప్  చేశారు. మార్వెల్ గా పేరుపెట్టిన ఈ రోబోలను సియోల్ లో సైంటిస్టులు ఆవిష్కరించారు. బ్రిడ్జిలు, బిల్డింగ్ లు, ఇండస్ట్రియల్  ట్యాంకులను రిపేర్  చేయడంలో ఈ రోబోలు సాయపడతాయని వారు వెల్లడించారు. ఆ రోబో పాదాల కింద మ్యాగ్నటిక్  ప్యాడ్లు అమర్చారు. దీంతో అవి గోడలు, సీలింగ్ లు ఎక్కుతాయి. గోడలపై  సెకండ్ కు 1.6 అడుగులు, సీలింగ్ ఫై రెండు అడుగుల దూరం ఆ రోబోలు కదులుతాయి. ‘‘మార్వెల్  రోబోల పనితీరును పరిశీలించాం.

 అంచనా వేసిన స్పీడ్ లోనే అవి కదిలాయి. ఆ రోబోలకు నాలుగు కాళ్లు ఉంటాయి. పైన తాబేలు లాగా డొప్ప ఉంటది. వాటి కాళ్లలో బిల్ట్  ఇన్  మ్యాగ్నటిక్స్ ను  ఫిట్  చేశాం. ఒక్కో రోబో బరువు 18 పౌండ్లు. వాటి వీపుపై ఆరు పౌండ్ల కార్గోను అవి తీసుకెళ్లగలవు. అంతేకాకుండా టీతర్ (తాడు లేదా చెయిన్) లేకుండానే అవి ఆపరేట్  చేయగలవు. గోడలపై వెనక్కి కూడా అవి కదులుతాయి” అని రిసర్చర్లు వెల్లడించారు. మార్వెల్ తో ప్రయోగం చేయగా.. అవి గోడలపై నాలుగు పౌండ్లు, సీలింగ్ పై ఏడు పౌండ్ల బరువును మోసుకెళ్లాయని తెలిపారు. అలాగే స్టీల్ తో కట్టిన ఇండస్ట్రియల్ ట్యాంక్ పై వాటిని టెస్ట్  చేశామని చెప్పారు. ‘‘స్టీల్ తో నిర్మించిన బ్రిడ్జిలు, బిల్డింగులు, నౌకలు, స్టోరేజ్  ట్యాంక్ లను మనుషులతో రిపేర్  చేయించడం కష్టమైన పని. ఎందుకంటే అవి ఎత్తులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణాల రిపేర్లలో మార్వెల్  వంటి రోబోల సాయపడతాయి” అని సైంటిస్టులు చెప్పారు.