గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసే వరకు పోరాటం చేస్తాం

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసే వరకు పోరాటం చేస్తాం
  • అధికారంలోకి వచ్చాక భాగ్యలక్ష్మి ఆలయం వద్దే మొదటి సభ
  • షేక్ పేట్ లో రెండోరోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

హైదరాబాద్: తెలంగాణలో అవినీతి, అక్రమాల పాలనపై బీజేపీ పూరించిన సమరశంఖం గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసే వరకు పోరాటం కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి సభ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే జరుగుతుందని ఆయన ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం రెండో రోజు షేక్ పేట్ ప్రాంతంలో కొనసాగుతోంది. మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. 
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఓల్డ్ సిటీ కి మెట్రో ఎందుకు రాలేదో ఎంఐఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీ కి మెట్రో వస్తే యువత కు ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. 2023 లో గోల్కొండ కోట మీద కాషాయపు జెండా ఎగురవేస్తామని, మొదటి బహిరంగ సభ భాగ్యలక్ష్మి అమ్మవారి పరిసరల్లోనే చేస్తామన్నారు. దేనికి భయపడని పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడకి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు స్వఛ్చందంగా పాల్గొంటున్నారని, స్వచ్చందంగా తరలివచ్చి యాత్రలో పాల్గొంటున్న కార్పొరేటర్లకు, కార్యకర్తల శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని బండి సంజయ్ అన్నారు. కర సేవలో పాల్గొన్న వ్యక్తి స్వామి గౌడ్, నెలలో 20 రోజులు రాజాసింగ్ కోర్టులకు వెళ్తున్నడాంటే ధర్మం కోసమేనని ఆయన తెలిపారు. అక్టోబర్ 2 వరకు జరిగే యాత్రలో అందరూ స్వచ్చందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివస్తోన్న భాగ్యనగర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.