పెట్రోలియం ప్రాడక్ట్స్ పై వేసిన వ్యాట్ తో రాష్ట్రానికి భారీ లాభాలు

పెట్రోలియం ప్రాడక్ట్స్ పై వేసిన వ్యాట్ తో రాష్ట్రానికి భారీ లాభాలు

టీఆర్ఎస్ నాయకులు కేంద్రంపై విమర్శలు చేయడం దారుణమన్నారు బీజేపీ కార్యవర్గ సభ్యులు  వివేక్ వెంకట స్వామి.దేశ ప్రజలకు మేలు చేయడం కోసం కేంద్రం లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 సుకం తగ్గించిందన్నారు. 29 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాలు సుంకం తగ్గించింది. సీఎం కేసీఆర్ మాత్రం తాము వ్యాట్ పెంచలేదని మీడియా సమావేశంలో చెప్పడం దారుణమన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోలియం ప్రాడక్ట్స్ పై వేసిన వ్యాట్ తో భారీగా లాభాలు వచ్చాయన్నారు.పెట్రోల్ ధరలను కేంద్రమే తక్కువ చేసుకోవాలని కేసీఆర్ చెప్పడం సరైంది కాదన్నారు. పెట్రోల్, లిక్కర్ పై వేసిన ట్యాక్స్ తోనే భారీగా లాభాలు వచ్చాయన్నారు.  

పెట్రోల్, డీజిల్ పై వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకట స్వామి. రాష్ట్రానికి వచ్చిన లాభాలను  సరిగా ఉపయోగించకుండా...  కమీషన్ల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఖర్చు చేసి..ఆంధ్రా కాంట్రాక్టర్లను ధనికులను చేసిన నేత కేసీఆర్ అని అన్నారు.