
- గతంలో భార్యను హత్య చేసిన నిందితుడు
- ఖమ్మం జిల్లాలో విషాదం
హైదరాబాద్: ఆస్తి కోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను ఓ వ్యక్తి చంపేశాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన ఇద్దరి కూతుళ్లు నీరజ(10), ఝాన్సీ(6)తో కలిసి తన తల్లి పిచ్చమ్మ((60)తో ఉంటున్నాడు.ఈ క్రమంలో తన తల్లి పేరు ఉన్న ఎకరం భూమిని అమ్మేందుకు ప్రయత్నించాడు. పొలం తన పేరుపై రాయాలంటూ తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేండ్లుగా వేధిస్తున్నాడు.
అయితే దీనికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఇవాళ తెల్లవారుజామున తల్లిని, ఇద్దరు కూతుళ్లను గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల వల్ల ముగ్గురిని చంపి పరారైనట్లు భావిస్తున్నారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వెంకటేశ్వర్లు స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, రెండేండ్ల క్రితం భార్యను కూడా హత్య చేశాడని స్థానికులు తెలిపారు.