హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కల్లకుంట్ల కిషన్ రావు గుర్తు పెట్టుకోండి తెలంగాణలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్సేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐదేండ్ల కోసం ఎన్నికైనం.. మరో ఐదేళ్లు పదవిలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు పవర్లో ఉన్న బీఆర్ఎస్.. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఏనాడు మన సమస్యలని పట్టించుకోలేదని విమర్శించారు.
శనివారం (ఫిబ్రవరి 7) ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగా సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు.
ALSO READ : పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తామా
మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని.. అభివృద్ధి పనులకు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నాయని విమర్శించారు. ప్రధాని మోడీని చూసి బీజేపీకి ఓటేయాలని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. ఎక్కడైనా పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తామా అని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి మోడీ వచ్చి సమస్యలు తీర్చుతారా అని ప్రశ్నించారు. మోడీని చూసి ఓటేస్తే ఇక్కడి బోడీలు పని చేయరని టీ బీజేపీ నేతలను విమర్శించారు.
పెళ్లాం మొగుళ్ల మాటలు కూడా విన్నరు:
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో పెళ్లాంమొగుళ్ల మాటలు కుడా విన్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనైతిక పనులు, తప్పులు చేస్తే నోటీసులు ఇవ్వకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్ర దొంగ పాసుపోర్టులు, దొంగ నోట్లు అని.. ఆయన చరిత్ర తూడ్చినా పోదని అన్నారు. అలాంటి చరిత్రను నేనేందుకు తూడ్చుతానన్నారు.
ALSO READ : మున్సిపల్ ఎన్నికలు క్లీన్ స్వీప్ చేయబోతున్నం
దళితలను సీఎం చేస్తానన్న మీ చరిత్రను నేనేలా తూడ్చుతానని.. కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొఖం చెల్లకే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా ఆలోచించి ఓటేయాలని సూచించారు.
