శామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా: అదిరిపోయే కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త పవర్‌హౌస్!

 శామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా: అదిరిపోయే కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త పవర్‌హౌస్!

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా శామ్సంగ్  అల్ట్రా మోడల్‌తో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సంచలనం సృష్టించబోతోంది. ఆపిల్ ఐఫోన్ 18 ప్రోకి గట్టి పోటీగా రానున్న ఈ ఫోన్   ఫీచర్స్ లీకైయ్యాయి. శామ్సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 25 ఫిబ్రవరి  2026న జరిగే అవకాశం ఉంది. 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ ధర సుమారు రూ. 1,34,990 నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

అదిరిపోయే డిజైన్, డిస్‌ప్లే
 ఈసారి ఫోన్ అంచులు కొంచెం కర్వ్ తో ఉంటాయి, దీనివల్ల ఫోన్ పట్టుకోవడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.  బ్లాక్,  కోబాల్ట్ వైలెట్ వంటి రంగుల్లో రానుంది. డిస్‌ప్లే చూస్తే 6.9-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED స్క్రీన్‌తో వస్తుంది. దీని 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్, వీడియోలు చాలా స్మూత్‌గా ఉంటాయి. అంతేకాకుండా, పక్కన ఉన్నవారికి మీ స్క్రీన్ కనిపించకుండా ఉండే కొత్త 'ప్రైవసీ డిస్‌ప్లే' టెక్నాలజీ కూడా ఇందులో ఉండవచ్చు.

ALSO READ : హోండా నుంచి రెండు కొత్త మోడల్స్ లాంచ్

 ఫోటోగ్రఫీ  కోసం.. వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెటప్ ఉంటుంది. ఒకటి 200MP ప్రైమరీ కెమెరా, మరొకటి 50MP టెలిఫోటో లెన్స్, ఆప్టికల్ జూమ్ కోసం 10MP టెలిఫోటో కెమెరా,  గ్రూప్ ఫోటోలు   కోసం 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 

పెర్ఫార్మెన్స్ & బ్యాటరీ
ఈ ఫోన్  అత్యంత వేగవంతమైన Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.5తో పని చేస్తుంది. బ్యాటరీ & ఛార్జింగ్ చూస్తే 5000mAh బ్యాటరీ ఉంటుంది. విశేషమేమిటంటే, ఈసారి 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రాబోతోంది. దీనివల్ల ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది.