ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా (HMSI) 125cc విభాగంలో డియో 125 ఎక్స్-ఎడిషన్, షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఈ పాత మోడళ్లకు కొత్త కలర్స్, అదిరిపోయే గ్రాఫిక్స్‌ను జోడించి మరింత స్టైలిష్‌గా వీటిని రూపొందించింది.
1. హోండా డియో 125 ఎక్స్-ఎడిషన్
యువతను ఆకట్టుకునేలా ఈ స్కూటర్‌ను సరికొత్త 'సైబర్ డ్రిఫ్ట్' థీమ్‌తో డిజైన్ చేశారు.లుక్ చూస్తే బాడీపై కొత్త రకమైన గ్రాఫిక్స్, డ్యూయల్-టోన్ కలర్స్ ఉన్నాయి. గ్రే ఇంకా బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీనికి కలర్ ఫుల్ అల్లాయ్ వీల్స్, మ్యాట్-ఫినిష్ కలర్స్ ఇచ్చారు. దీనివల్ల స్కూటర్ రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా ఆధునికంగా కనిపిస్తుంది. దీని ధర రూ. 87,733 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
2. హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బైకుల్లో ఒకటైన షైన్, ఇప్పుడు మరింత ప్రీమియం లుక్‌లో వచ్చింది. దీని డిజైన్‌ను చాలా సింపుల్‌గా, క్లాసీగా మార్చారు. కొత్త ప్రీమియం గ్రాఫిక్స్ బైక్‌కు కొత్తందాన్ని తెచ్చాయి. ఈ బైక్ పెర్ల్ సైరెన్ బ్లూ రంగులో లభిస్తుంది. దీనికి స్పెషల్ గా బ్రౌన్ కలర్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు, ఇది బైక్‌కు రాయల్ లుక్ ఇస్తుంది. దీని ధర రూ. 86,211 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
Also Read : ఆస్ట్రేలియాలోనూ అంబానీ దూకుడు
ఈ రెండు మోడళ్ల కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మీరు ఆన్‌లైన్‌లో హోండా వెబ్‌సైట్ ద్వారా లేదా నేరుగా షోరూమ్‌కి వెళ్లి బుక్ చేసుకోవచ్చు.డెలివరీ: ఫిబ్రవరి రెండో వారం నుండి ఇవి షోరూమ్‌లలో అందుబాటులోకి వస్తాయి.
