రీల్స్ పిచ్చి ఎంత పనిచేసింది..ఉరి సీన్ చేస్తుండగా..గొంతు బిగుసుకుని మహిళ..

రీల్స్ పిచ్చి ఎంత పనిచేసింది..ఉరి సీన్  చేస్తుండగా..గొంతు బిగుసుకుని మహిళ..

సోషల్ మీడియా రీల్స్​ పిచ్చి యువత ప్రాణాలు తీస్తుంది. లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ప్రమాదకరమైన ఫీట్స్​ చేస్తున్నారు. అనుకోని సంఘటనలతో ఇబ్బందుల పాలవతున్నారు. బైక్ స్టంట్స్, రైలు పట్టాలు, లోతైన జలాశయాల దగ్గర ప్రమాదకరమైన వీడియోలు చేయడం, ఫ్యాన్​ కు ఉరివేసుకోవడం వంటి  చర్యలతో  ఆకస్మాత్తుగా చనిపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన యూపీలో బండాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

ఉత్తరప్రదేశ్​ లోని బోండా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల మహిళ తన ఇంట్లో రీల్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందింది. మెడకు ఉరివేసుకొని స్టూలపై నిల్చుని ఉరి వేసుకునే సీన్​ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. 

ALSO READ : కుత్బుల్లాపూర్‎లో మహిళా ఫిజియో డాక్టర్ ఆత్మహత్య

మృతురాలు ఇంట్లో  స్టూల్​ పై నిలబడి ఉరివేసుకునే సీన్ చేస్తుండగా .. బ్యాలెన్స్​ తప్పి జారిపడటంతో ఆమె మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుని ఆమె మరణానికి దారితీసింది. నాలుగేళ్ల కుమార్తె గదిలోకి వచ్చి సాయం కోసం కేకలు వేయడంతో విషయం చుట్టుపక్కల వారికి తెలిసింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్​ కు తరలించారు. ప్రాధమిక విచారణలో ప్రమాదవ శాత్తు జరిగినట్లు తేలింది. 

ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు.. గతేడాది అక్టోబర్​ లో ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీలోని శాంతినగర్​లో రీల్స్​ కోసం 14 ఏళ్ల బాలుడు సీలింగ్​ ఫ్యాన్​ కు ఉరివేసుకొని చనిపోయాడు. బాలుడి మరణం తట్టుకోలేక తల్లడిల్లిన కుటుంబాన్ని కౌన్సిలింగ్​ ఇచ్చి మామూలు స్థితికి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ALSO READ : స్పా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం..

ఈ ఘటన తర్వాత ఆన్​ లైన్​ కంటెంట్ క్రియేటివిటీపై చాలా విమర్శలు వచ్చాయి. వ్యూస్​, లైకులకోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కరెక్టు కాదని నెటిజన్లు సలహాలిచ్చారు.ఇక రీల్స్​ విషయంలో తమ పిల్లలను పేరెంట్స్​ ఎప్పటికప్పుడు అబ్జర్వ్​ చేస్తుండాలని అధికారులు సూచించారు.