కేరళలోని తిరువల్లలో ఒక స్పాలో పని చేసే మహిళపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది సాధారణ నేరస్తుడు కాదు, ఇప్పటికే చాల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒక రౌడీ.
సమాచారం ప్రకారం సుబిన్ అలెగ్జాండర్ అనే నిందితుడు సహా అతని అనుచరులు గత కొన్ని రోజులుగా ఓ స్పా యజమానిని రూ.50వేలు ఇవ్వాలని బెదిరించారు.
ఫిబ్రవరి 1న మధ్యాహ్నం స్పాకు వచ్చిన నిందితులు, యజమాని డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో అక్కడి మహిళా ఉద్యోగినిని పక్క గదిలోకి లాకెళ్లి కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ALSO READ : ఢిల్లీలో బైకర్ విషాద ఘటన..పది నిమిషాల్లో వస్తానన్నాడు..
దారుణం ఏమిటంటే, నిందితులు ఆ దారుణాన్ని ఫోన్లలో చిత్రీకరించడమే కాకుండా, సెల్ఫీలు కూడా తీసుకున్నారు. స్పాకు వచ్చిన మరో వ్యక్తిని కూడా కొట్టి, ఆ మహిళ పక్కన పడుకోబెట్టి వీడియోలు తీశారు. వెళ్తూ వెళ్తూ స్పా నుండి రూ. 2,500 నగదును కూడా ఎత్తుకెళ్లారు.
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సుబిన్ అలెగ్జాండర్ పై ఇప్పటికే హత్యాయత్నం, దొంగతనం వంటి 11 కేసులు ఉన్నాయి. గతంలో ఇతన్ని 'కాపా' (గూండా యాక్ట్) కింద అరెస్ట్ చేశారు.
పోలీసులు సుబిన్‌ను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, అతను పోలీసులపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పాడు. ఈ దాడిలో ఎస్ఐ ఉన్నికృష్ణన్, మరో కానిస్టేబుల్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ALSO READ : బెంగళూరు ఆటోవాలలపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ ఫైర్..
మొదట్లో బాధితురాలు భయంతో ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. కానీ, స్పాలోని సిసిటివి (CCTV) ఫుటేజ్ బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు బాధితురాలి నుండి స్టేట్‌మెంట్ తీసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
