అప్పుడు సరిగ్గా 11.50 గంటలు.. ఇంకా రాలేదని కమల్ కి ఫోన్ చేశాం.. మరో పది నిమిషాల్లో ఇంటికి వస్తానన్నాడు.. మా యానివర్సరీ కేక్ రెడీ ఉంది.కమల్ కోసం ఎదురు చూస్తున్నాం.. పది.. ఇరవై.. అరగంట గడిచిపోయింది..అయినా కమల్ ఇంటికి రాలేదు.. చుట్టు పక్కల వెదికాం..పార్కులు వెదికాం..రాత్రంతా వెదుకుతూనే ఉన్నాం.. మా దురదృష్టం తెల్లవారుతుండగానే..విషాదకరమైన వార్త విన్నాం..ఢిల్లీలో రోడ్డుపై గుంతలోపడి మృతిచెందిన బైకర్ కమల్‌ను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ALSO READ : నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం..
గురువారం (ఫిబ్రవరి 6) రాత్రి ఢిల్లీలోని జనక్ పురిలో రోడ్డుపై వాటర్‌బోర్డు తవ్విన గుంతలోపడి HDFC బ్యాంకు మేనేజర్ కమల్ మృతిచెందడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొడుకు ఎదిగాడు.. ఉద్యోగం చేస్తున్నాడు..కుటుంబాన్ని పోషిస్తాడు అనుకునే సమయంలో కమల్ చనిపోవడంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. వాటర్ బోర్డు గుంతలు తవ్వి ఎలాంటి సంకేతాలు లేకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రమాదం జరిగింది.తమ కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. కమల్ పేరెంట్స్ ఫిర్యాదులో ఢిల్లీ వాటర్ బోర్డు అధికారులపైకేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనతో ఢిల్లీ వాటర్ బోర్డు అధికారులు పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ALSO READ : అమెరికాలో 'జీరో డ్యూటీ'తో భారతీయ రైతులకు పండగే..!
నడిరోడ్డుపై 20 అడుగుల పొడవు, 14 అడుగుల లోతు, 13 అడుగుల వెడల్పు గుంతను తవ్వి ఎటువంటి హెచ్చరిక బోర్డులు గానీ, బారీకేడ్లు గానీ, సరైన లైటింగ్ గానీ పెట్టకపోవడం వంటి భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ప్రమాదానికి కారణమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు, కమల్ కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యాన్ని హైలైట్ చేశారు.
కమల్ విషాద మరణం పట్ల ఢిల్లీ వాటర్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. వాటర్ పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్న ది నిజమే..అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన తర్వాత ముగ్గురు వాటర్ బోర్డు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు.
