హైదరాబాద్: మహిళా ఫిజియో డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సాయిబాబా నగర్లో నివాసముండే బత్తిని అనిత (29) మల్లారెడ్డి హాస్పిటల్లో ఫిజియోథెరపి డాక్టర్‌గా పని చేస్తోంది. ఏమైందో తెలియదు గానీ అవివాహితురాలైన అనిత శనివారం (ఫిబ్రవరి 7) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ALSO READ : ఢిల్లీలో బైకర్ విషాద ఘటన..పది నిమిషాల్లో వస్తానన్నాడు..
గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
