తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నీటి గొడవలు లేవు: దేవేంద్ర ఫడ్నవీస్

తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నీటి గొడవలు లేవు: దేవేంద్ర ఫడ్నవీస్

గోదావరి జలాల విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా  కాగజ్​నగర్​ లో  జరిగిన సభలో పాల్గొన్న ఫడ్నవీస్.. గోదావరి జలాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. మేం నీళ్లు ఇవ్వడం వల్లే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. మాకు నష్టం జరిగినా నీళ్లు ఇస్తున్నామన్నారు. అందరూ బాగుండాలనే సంకల్పంతో బీజేపీ ముందుకు సాగుతోంది. మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికల్లో బీజేపీని  గెలిపించాలని కోరారు. 

ప్రధానిమోదీ పాలనలో పట్టణాల అభివృద్దికి కేంద్రం నేరుగా నిధులు మంజూరు చేస్తోందన్నారు ఫడ్నవీస్​. స్మార్ట్​, అమృత్​ పథకాలతో పట్టణాలను అభివృద్ధి చేస్తోందన్నారు.పట్టణాల్లో రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ప్రధాని అధికంగా నిధులు ఇస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు  మహారాష్ట్ర సీఎం. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉంది.. ఇప్పుడు అప్పుల పాలయ్యింది.. బీఆర్​ ఎస్​ ,కాంగ్రెస్​ లు తెలంగాణను అప్పుల పాలు చేశాయన్నారు. పైసా లేకుండా  రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాను లూటీ చేసి అవినీతిపాలనతో అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు.  ఎన్నో కలలతో ఏర్పాటైన తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు ఫడ్నవీస్​.