హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం

హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం

హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. మే 18వ తేదీ శనివారం  నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో ప్రారంభమైన  వర్షం క్రమంగా ఎక్కువైంది. గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్ , మియాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, అమీన్పూర్ బిహెచ్ఎల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, మలక్ పేట, చంపాపేట, మాదన్న పేట, చాదర్ ఘాట్, సైదాబాద్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, నాచారం, ఓయూ, తార్నాక, నల్లకుంట, అంబర్ పేట, రామాంతపూర్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షానికి మహానగరంలో జనజీవనం స్థంభించిపోయింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నీరు చేరుకుని చెరువులను తలపించింది. దీంతో వాహనాదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ముందుకు కదలలేక భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఇక, రాష్ట్రంలోని పలు జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంటనష్టం జరిగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వాపోతున్నారు. మరోవైపు రానున్న 5 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాఅలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.