కొల్లాపూర్, వెలుగు: అనంతరం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో జడ్పీ గర్ల్స్హైస్కూల్లో నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. యూటీఎఫ్ సభ్యులుగా ఉన్న టీచర్లు అకాల మరణం చెందితే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి ద్వారా రూ.6 లక్షలు అందిచడం గొప్ప విషయం అన్నారు.
కోడేరు మండలంలో ఎస్జీటీగా పనిచేస్తున్న మిద్దె కేశవులు ఇటీవల అకాల మరణం చెందటంతో ఆయన కుటుంబ సభ్యులకు రూ.6 లక్షలు అందజేస్తామన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, బెనిఫిట్స్ ను త్వరగా అందేలా చూస్తామన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, కుటుంబ సంక్షేమ నిధి రాష్ట్ర చైర్మన్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలో 52 మంది టీచర్లు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.3 కోట్లు అందజేశామని తెలిపారు.
ఉపాధ్యాయ ఉద్యోగులకు శాపంగా మారిన
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి సామాజిక ఆర్థిక భద్రత కలిగించే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ డీఏలు తక్షణమే చెల్లించాలని, రెండో పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి కొత్త పేస్కేళ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ యం.శ్రీధర్ శర్మ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ నిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్ ఎ.చిన్నయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సి.తిరుపతయ్య, ఉపాధ్యక్షురాలు ఎం.రమాదేవి, జిల్లా కోశాధికారి జె.బాల్ రాజ్, జిల్లా కార్యదర్శులు ఎన్.నెహ్రూప్రసాద్, పి.మహేశ్ బాబు, కె.శంకర్, ఆర్.లక్ష్మణ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు బి.నారాయణ, ఎఫ్ డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎండీ రబ్బానీ పాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొల్లాపూర్ సంతలో జూపల్లి
మార్నింగ్ వాక్ లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ సంతను ఆదివారం ఉదయం సందర్శించారు. మార్కెట్లోని వ్యాపారస్తులతో మాట్లాడి కూరగాయల రేట్లు, తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.
