ఫుట్ బాల్ ఆటపై పిల్లల్లో ప్రేమను పెంచండి : కలెక్టర్ జితేశ్

ఫుట్ బాల్ ఆటపై పిల్లల్లో ప్రేమను పెంచండి : కలెక్టర్ జితేశ్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​

భద్రాచలం, వెలుగు : ఫుట్​ బాల్​ ఆటపై పిల్లల్లో ప్రేమను పెంచాలని కలెక్టర్​ జితేశ్ వి పాటిల్​ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్​ కాలేజీ గ్రౌండ్​లో ఆదివారం భద్రాచలం ఫుట్​బాల్​ క్లబ్ ఆధ్వర్యంలో మూడోసారి నిర్వహిస్తున్న 7-ఏ -సైడ్​ స్టేట్ లెవల్​ ఫుట్​బాల్​ టోర్నమెంట్​ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తాను చిన్నప్పుడు ఫుట్​బాల్​ ప్లేయర్​నేనని, డిఫెండర్​ని అని వివరించారు. గతంలో ఒక బాల్​ ఉంటే చాలు ఫుట్​బాల్​ ఆడేవాళ్లమని, ఇప్పుడు అనేక సౌకర్యాలు వచ్చాయని తెలిపారు. 

క్రీడలు శారీరక ధృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టుభావనను పెంపొందిస్తాయని తెలిపారు. త్వరలో జిల్లా ఫుట్​బాల్​ లీగ్​ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. భద్రాచలం జూనియర్​ కాలేజీ గ్రౌండ్​లో గ్యాలరీ నిర్మాణానికి పీఆర్​, ట్రైబల్​ వెల్ఫేర్​ ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్లతో ప్రతిపాదనలు తయారు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుట్​ బాల్​ క్రీడా నిర్వాహకులు చందూ, సలీం, మన్మధ, రాజు, జీవీ రామిరెడ్డి, జీఎస్​ శంకర్​రావు తదితరులు పాల్గొన్నారు.

క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి 

పాల్వంచ : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థిని విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగితే జాతీయ స్థాయి బహుమతులు సాధించడం అంత కష్టమేమీ కాదని కలెక్టర్ జితేశ్​ అన్నారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో ఆదివారం స్థానిక తె లంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షి యల్ డిగ్రీ కళాశాల విద్యార్థినిల అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కళాశాల నుంచి విద్యార్థినులు ఏడు బంగారు, ఒక రజిత, 11 కాంస్య పతకాలు సాధించడం అభినందనీయమన్నారు.

దీని మూలంగా 35 పాయింట్లు సాధించిన విద్యార్థినిలను ఆయన ప్రశంసిం చారు. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన కోచ్ అన్నం వెంకటేశ్వర్లును సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పరంధామ రెడ్డి, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహీధర్, ఒలంపిక్ అసోసియేష న్ జిల్లా ఉపాధ్యక్షుడు వై.వెంకటేశ్వర్లు, ఎస్ జీఎఫ్ జిల్లా కార్యదర్శి నరేశ్, కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, అథ్థెటిక్స్ కోచ్ నాగేంద్ర బాబు, టెన్నిస్ కోచ్ డేనియల్ పాల్గొన్నారు.