- పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మట్టా దయానంద్
కల్లూరు, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 3, 4 ,18వ వార్డుల్లో స్థానిక నాయకులు, అభ్యర్థులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
అనంతరం బొగ్గవరపు చిన్న దంపతులు డాక్టర్ మట్టా దయానంద్, పొంగులేటి ప్రసాద్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్పర్సన్ నీరజాప్రభాకర్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు చందర్రావు, పోట్రూ అర్జున్ రావు, భాగం ప్రభాకర్ చౌదరి, బొల్లం రామారావు, ఆళ్లకుంట నరసింహారావు, చౌదరి హోటల్ నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
