విశాఖ పోర్టులో ఉద్యోగాలు.. బిటెక్ చేసినోళ్లకు మంచి ఛాన్స్..

విశాఖ పోర్టులో ఉద్యోగాలు.. బిటెక్ చేసినోళ్లకు మంచి ఛాన్స్..

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. చివరి తేదీ జనవరి 19. 

పోస్టుల సంఖ్య: 03 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)( క్లాస్–I)

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. పారిశ్రామిక/ వాణిజ్య/ ప్రభుత్వ సంస్థలో పోర్ట్, మెరైన్ నిర్మాణాల్లో ప్లానింగ్/ కన్​స్ట్రక్షన్/ డిజైన్/ మెయింటెనెన్స్​లో ఐదేండ్ల ఎగ్జిక్యూటివ్ కేడర్ అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

అప్లికేషన్:  ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 16.

లాస్ట్ డేట్: 19 జనవరి  2026, 

పూర్తి వివరాలకు vizagport.com వెబ్​సైట్​ను సందర్శించండి.