మలయాళ హిట్ మూవీకి తెలుగులో షాక్.. ప్రేక్షకులు లేక తొలి షోలు రద్దు!

మలయాళ హిట్ మూవీకి తెలుగులో షాక్.. ప్రేక్షకులు లేక తొలి షోలు రద్దు!

విభిన్నమైన కథాంశాలతో ప్రస్తుతం మలయాళం చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. చిన్న చిత్రాలు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్ గా అద్వైత్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ 'చథా పచ్చ' కేరళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్కడ సుమారు రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇదే ఉత్సాహంతో ఈ చిత్రాన్ని అదే పేరుతో మేకర్స్  ఈరోజు ( ఫిబ్రవరి 13న ) తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు.

తెలుగులో ఆరంభమే డిజాస్టర్!

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఊహించని పరిణామం ఎదురైంది.  కేరళలో కాసుల వర్షం కురిపించిన ఈ 'చథా పచ్చ' సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది.  నేడు విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి స్పందన చాలా తక్కువగా ఉంది. ఎంతలా అంటే.. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన AAA సినిమాస్ వంటి మల్టీప్లెక్స్‌లలో సైతం మినిమం ఆక్యుపెన్సీ లేకపోవడంతో మార్నింగ్ షోలు రద్దు చేయాల్సి వచ్చింది. కేవలం హైదరాబాద్‌లోనే కాదు, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలోని పలు ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కనీస ఆక్యుపెన్సీ లేకపోవడంతో చిత్ర యూనిట్ కు షాక్ మారింది.

వీకెండ్ గట్టెక్కిస్తుందా?

ఈ సినిమాలో మలయాళ నేటివిటీ ఎక్కువగా ఉండటం. ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  కనీసిం ఈ సినిమా ఒకటి ఉందన్న సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు. దీంతో థియేటర్లకు ప్రేక్షకులు రాలేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే, మలయాళంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు తెలుగులో 'మౌత్ టాక్' ద్వారా ఆదరణ పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి.

కథా నేపథ్యం..

ఈ సినిమా కథ ముగ్గురు సోదరుల చుట్టూ తిరుగుతుంది. మారుమూల గ్రామంలో ఉండే ఈ సోదరులకు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) అంటే ప్రాణం. ఆ పిచ్చితోనే వారు ఎవరికీ తెలియకుండా ఒక 'అండర్‌గ్రౌండ్ రెజ్లింగ్ ప్రమోషన్'ను ప్రారంభిస్తారు. అమెచ్యూర్ స్థాయిలో వీరు చేసే కుస్తీ విన్యాసాలు, వాటి వల్ల తలెత్తే కామెడీ, ఆ తర్వాత వచ్చే ఊహించని మలుపులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ కామెడీలో ఇషాన్ షౌకత్, సిద్ధిక్, మరియు లక్ష్మి మీనన్ కీలక పాత్రలు పోషించారు.

►ALSO READ | Funky Movie Review: విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ రివ్యూ... నవ్వులు పండాయా? నిరాశ పరిచాయా?

రీల్ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు శంకర్-ఎహసాన్-లోయ్ , ముజీబ్ మజీద్ స్వరాలు అందించారు. యాక్షన్ , కామెడీ మేళవింపుగా సాగే ఈ చిత్రంలో రెజ్లింగ్ సన్నివేశాలను చాలా సహజంగా, అదే సమయంలో ఫన్నీగా తెరకెక్కించారు. కేరళలో హిట్ కొట్టిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మొదటి షోతోనే నిరాశను మిగిల్చింది. మరి వీకెండ్ అయినా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందో లేదో చూడాలి.