T20 World Cup: హిస్టరీ రిపీట్.. 19 ఏళ్ల తర్వాత ఆసీస్ పై గెలిచిన జింబాబ్వే..

T20 World Cup: హిస్టరీ రిపీట్.. 19 ఏళ్ల తర్వాత ఆసీస్ పై గెలిచిన జింబాబ్వే..

T20 World Cup: టీ 20 వరల్డ్ కప్ లో జింబాబ్వే జట్టు సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా జట్టును పసికూన జింబాబ్వే మట్టికరిపించింది. తమ బ్యాటింగ్, బౌలింగ్ తో కంగారూలను కంగారు పెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. జస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి.. 169 రన్స్ చేసింది. 170 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఆసీస్.. ఎవరూ ఊహించని విధంగా.. 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ ఆసీస్ జట్టుపై జింబాబ్వే గెలిచింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రపంచ కప్ లో కంగారులను ఈ పసికూన ఓడించింది. వివరాల్లోకి వెళితే.. ఆసీస్ బ్యాటింగ్ లో మార్కస్ స్టోయినిస్ (6), ట్రావిస్ హెడ్ (17), జోష్ ఇంగ్లిస్ (8) దారుణంగా విఫలం కావడంతో.. టీమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్ జీరో రన్స్ పెవిలియన్ కి వెళ్లిపోయారు. జట్టును ఆదుకునే క్రమంలో ఆసీస్ బ్యాటర్లు మాట్ రెన్షా (65), మాక్సీవెల్ (31) కాసేపు పోరాటం చేశారు. చివర్లో వీరు ఔట్ కావడంతో కంగారుల జట్టు ఘోరంగా ఓడిపోయింది. 

►ALSO READ | T20 World Cup: జింబాబ్వే చేతిలో ఆసీస్ చిత్తు.. వరల్డ్ కప్ లో సంచలనం

జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ టీ20 ప్రపంచ కప్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 64 పరుగులతో బ్రియాన్ నాటౌట్ గా నిలవగా.. తడివానాషే మరుమాణి, ర్యాన్ బర్ల్ కూడా చెరో 35 రన్స్ చేశారు. చివర్లో కెప్టెన్ సికందర్ రజా 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా బౌలింగ్ లో మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీసుకున్నారు.