T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్–బీ నుంచి జరుగుతున్న మ్యాచ్ లో ఒమన్ ని ఐర్లాండ్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 96 పరుగుల తేడాతో ఒమన్ మీద ఐర్లాండ్ గ్రాంఢ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచిన ఒమన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. దీంతో ఒమన్ ముందు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఐర్లాండ్ బ్యాటర్లలో లార్కన్ టకర్ 51 బంతుల్లో 94 పరుగులు చేయగా, మరో బ్యాటర్ గారెత్ డెలనీ కూడా 56 పరుగులతో ఐర్లాండ్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ALSO READ : రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ గా రియాన్ పరాగ్
లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే 136 పరుగులకే ఆలౌట్ అయింది. ఒమన్ ఓపెనర్ ఆమిర్ కలీం అద్భుతమైన హాఫ్ సెంచరీలో చెలరేగిపోగా.. మరో ఓపెనర్ కెప్టెన్ జితేందర్ సింగ్ కేవలం 7 రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆశిష్ ఒడెదారా సైతం తీవ్రంగా నిరాశ పరిచాడు.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హమ్మద్ మీర్జా జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. 46 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఒమన్ బ్యాటర్లు అందరు పెవిలియన్ కి క్యూ కట్టారు. దీంతో 96 పరుగుల తేడాతో ఒమన్ పై ఐర్లాండ్ ఘన విజయం సాధించింది.
