కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని కార్యాలయం పేరు మార్పు, నోయిడా మెట్రో లైన్ నిర్మాణం, గడె బెళ్లూరు- మహబూబ్ నగర్ 4 లైన్ల హైవే కు నిధుల విడుదల కు ఆమోదం తెలిపింది.
గడెబెళ్లూరు నుంచి మహబూబ్ నగర్ మధ్య 4 లైన్ల జాతీయ రహదారికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.రూ. 3వేల 715 కోట్లు నిధులను విడుదల చేసింది. నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 11.6 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణానికి రూ.2,254 కోట్ల రూపాయల కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొంది. నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపింది.ఢిల్లీ -అంబాల మధ్య 2 కొత్తరైల్వే లైన్ల నిర్మాణం చేపడుతున్నట్లు కేబినెట్ తెలిపింది.
ALSO READ : 160 కిలోమీటర్ల స్పీడా.. అది కారునా.. విమానమా..
స్టార్టప్ ఇండియా ఫండ్ కోసం పదివేల కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు దేశంలో రెండు లక్షల స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రాలు, మున్సిపల్ సంస్థలకు కేంద్రం మరింతగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది.
