మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవడంలో బీఆర్ ఎస్ పార్టీ అట్టర్ ప్లాప్ అయిందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని మున్సిపల్ ఫలితాలు చెప్తున్నాయన్నారు. బీఆర్ ఎస్ చేతగాని తనం వల్లే కాంగ్రెస్ కు అన్ని సీట్లు వచ్చాయింటూ తీవ్ర విమర్శలు చేశారు కల్వకుంట్ల కవిత.
బీఆర్ ఎస్, బీజేపీ మధ్య పొత్తుకు మున్సిపల్ ఎన్నికలతో తొలి అడుగు పడిందన్నారు కవిత. కంచు కోట అయిన ఉత్తర తెలంగాణలో బీఆర్ ఎస్ బలహీనపడిందన్నారు. గతంలో 90శాతం గెలిచిన బీఆర్ఎస్ 17సీట్లుకు పడిపోవటం సిగ్గుచేటన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ ముందే డిసైడ్ అయిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.
అవసరం వచ్చినప్పుడు మాత్రమే బీఆర్ఎస్ కు కార్మికులు గుర్తొస్తారు.. ఒకప్పుడు కమ్యూనిస్టులను తోక పార్టీలుగా వర్ణించిన బీఆర్ ఎస్.. ఇప్పుడు సీపీఐకి మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తోకపార్టీలకే బీఆర్ ఎస్ తోకపార్టీగా మారిందని సీపీఐ అడగకుండానే కొత్తగూడెంలో సీపీఐకి కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం దిగజారుడుతనమేనని విమర్శించారామె. కాళేశ్వరంపై కూనంనేని చేసిన ఆరోపణలను కేటీఆర్ ఒప్పుకుంటున్నట్లేనా ప్రశ్నించారు. కార్మికుల కోసం సీపీఐకి మద్దతు ఇచ్చామంటూ కేటీఆర్ నయవంచన చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మరో వైపు సీఎం రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేశారు కవిత. చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వ సొమ్ముతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని ఆరోపించారు. నేనే రాజు నేనే మంత్రి.. సీఎం పదవి ఆరు నెలలబోనస్ అంటున్న రేవంత్ రెడ్డి.. రైతుల బోనస్ గురించి మాట్లాడాలన్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కవి.. ఆసంగతి మొదటి రేవంత్ రెడ్డి చూసుకోవాలన్నారు.
జాగృతిపై కామెంట్స్ చేస్తున్నవారిని హెచ్చరించింది కల్వకుంట్ల కవిత. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే..పిక్చర్ బాకీ హై అంటూ వార్నింగ్ ఇచ్చింది. కరీంనగర్ కార్పొరేషన్ గెలుపు కోసంబీజేపీ అష్టకష్టాలుపడ్డదని విమర్శించింది.. కరీంనగర్ లో తప్పా తెలంగాణలో బీజేపీ ఎక్కా లేదన్నారు కవిత.
వడ్డేపల్లి మున్సిపాలిటీ దక్కించుకోవడం పై స్పందించిన కవిత వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రలోభాలతో గురిచేస్తుందన్నారు. ఎవరకి మద్దతునివ్వాలో.. స్థానిక జాగృతి నేతలు డిసైడ్ చేసుకుంటారని చెప్పారు . 40కి పైగా స్థానాల్లో జాగృతి, AIF అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో సైతం AIFBతో కలసి జాగృతి పోటీ చేస్తుందనిస్పష్టం చేశారు .
