ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ మేయర్ పీఠం మాదే : కేంద్రమంత్రి బండి సంజయ్

ఎన్ని కుట్రలు చేసినా  కరీంనగర్ మేయర్ పీఠం  మాదే : కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్ మేయర్ పీఠం బీజీపీకి దక్కకుండా మూడు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని  కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ లో ఘన విజయం సాధించామన్నారు . స్వతంత్రంగా గెలిచిన వారు బీజేపీలో చేరడంతో   మేజిక్ ఫిగర్ దాటామని చెప్పారు. 

కరీంనగర్ లో కాంగ్రెస్ ,బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తాము ముందే చెప్పామన్నారు. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని.. ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ ప్రజలు బీజేపీకే ఓటేశారన్నారు బండి సంజయ్. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిస్తే కూడా 26 సీట్లకే పరిమితమయ్యారని  చెప్పారు.  బీజేపీకి మేయర్ పదవి రానీయ్యకూడదని ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. కరీంనగర్ వేదికగా ఈ మూడు పార్టీల బండారం బయటపడబోతోందన్నారు. దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

కరీంనగర్ లో మేయర్ పదవి కోసం గుంట నక్కలన్నీ ఒక్కటయ్యాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు .ప్రజా తీర్పుకు భిన్నంగా కుట్రలు చేస్తే కరీంనగర్ నుండే మీ అంతు చూస్తా అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లను హెచ్చరించారు బండిసంజయ్.  బీజేపీ శక్తి ఏందో  కరీంనగర్ ప్రజల దమ్మేందో చూపిస్తామన్నారు. ఒక్కొక్కరిని రోడ్లపై ఉరికిస్తామని... ప్రజాతీర్పును కాలరాస్తే  కరీంనగర్ లో  కాంగ్రెస్,  బీఆర్ఎస్ నేతలను తిరగనియ్యమని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.