మెరుగైన విద్యా ప్రమాణాలే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

మెరుగైన విద్యా ప్రమాణాలే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
  • రూ. 2.7 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు  భూమిపూజ 

అమ్రాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూల్ దశ నుంచే ఉత్తమ విద్యా ప్రమాణాలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మన్ననూర్ గ్రామంలో రూ. 2. 7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ నిర్వహించారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..  సీఎం రేవంత్ రెడ్డి విద్యా ప్రమాణాల మెరుగుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. 

మాజీ మండల అధ్యక్షుడు పంబలి బుచ్చయ్య కుమారుడు జగదీశ్వర్ మృతి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం బుచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత రాజారాం, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేశ్, రహీం, శోభ, వెంకట రమణ, తులసీరాం, సత్యనారాయణ, రావుఫ్, బాలస్వామి, శ్రీనివాసులు, నిరంజన్, బాలయ్య పాల్గొన్నారు.