బోధన్, వెలుగు : తల్లిదండ్రులు తమ పిల్లలను పక్క పిల్లలతో పోల్చవద్దని, వారికి ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని ప్రముఖ వక్త భారతీయం సత్యవాణి సూచించారు. శనివారం బోధన్ పట్టణంలోని విజయసాయి స్కూల్ వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం వేదాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు అన్నారు. పిల్లలు బయట జంక్ఫుడ్స్తినొద్దని సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, పీఆర్వో ఐఆర్ చక్రవర్తి, ప్రైమరీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
