నారాయణపేట పట్టణ శివారులోని రూ. 2.89 లక్షలు, దుస్తుల స్వాధీనం : ఎస్ఐ వెంకటేశ్వర్లు

 నారాయణపేట పట్టణ శివారులోని రూ. 2.89 లక్షలు, దుస్తుల స్వాధీనం : ఎస్ఐ వెంకటేశ్వర్లు

నారాయణ పేట/మక్తల్​,  వెలుగు : నారాయణపేట పట్టణ శివారులోని ఎర్రగుట్ట చెక్‌‌‌‌పోస్ట్ వద్ద శుక్రవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు, దుస్తులు పట్టుబడ్డాయి. టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుర్మిట్కల్ నుంచి నారాయణపేట వైపు వస్తున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 1,57,420 విలువైన దుస్తులను స్వాధీనం చేసుకోగా, వీటిని గుర్మిట్కల్‌‌‌‌కు చెందిన మహమ్మద్ తాకి, ఎండీ నవాజ్‌‌‌‌లు తరలిస్తున్నట్లు గుర్తించారు.

అదేవిధంగా, అనుమానాస్పదంగా నగదు తరలిస్తున్న బలిచక్రం గ్రామానికి చెందిన మల్లికార్జున వద్ద రూ. 1.80 లక్షలు, జాఫర్ వద్ద రూ. 1,09,300 కలిపి మొత్తం రూ. 2,89,300 నగదును సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నందున, అనుమతులు లేకుండా నగదు లేదా వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.