జన సంద్రమైన మన్యంకొండ

జన సంద్రమైన మన్యంకొండ

పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శనివారం జనసంద్రంగా మారింది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ముగిసినప్పటికీ జాతర కొనసాగుతోంది. శనివారం కావడంతో భక్తులు  పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి రావడంతో క్యూలైన్లతోపాటు ఆయాల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు తలనీలాలు సమర్పించుకొని కోనేరులో స్నానాలు చేసి  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 

శివాలయం, అలివేలు మంగతాయారు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవస్థానం వారు భక్తులకు అన్నదాన వితరణను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ చైర్మన్ అలహరి మధుసూదన్ కుమార్, ఈవో నిత్యానంద చారి, సూపరింటెండెంట్​ నిత్యానంద చారి పర్యవేక్షించారు.      -మహబూబ్ నగర్ రూరల్, వెలుగు