అధికార పార్టీతోనే ‘ఆమనగల్లు’ అభివృద్ధి సాధ్యం : ఎంపీ మల్లు రవి

అధికార పార్టీతోనే ‘ఆమనగల్లు’ అభివృద్ధి సాధ్యం :  ఎంపీ మల్లు రవి
  •     ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి 

 ఆమనగల్లు, వెలుగు :  అధికార పార్టీతోనే ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని, అందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శనివారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 1,2,10, 12, 14 వార్డుల్లో వారు ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ ల్లో వారు మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న బీజేపీతో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో ఆమనగల్లు అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే రూ.63 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తుచేశారు. అనంతరం ముర్తుజపల్లికి చెందిన బీజేపీ, బీఆర్​ఎస్​ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.