నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కంచుకోట అని, ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో శనివారం 11, 6, 7, 8, 9, 10, 25 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ. 2,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు వేగంగా ప్రగతి పథంలో ఉన్నాయని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను మరింత అభివృద్ధి చేస్తాననన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్లాట్ ఉన్న పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ హఫీజ్ ఖాన్, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, పాశం రామ్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, సీపీఐ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
