కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం :  మంత్రి సీతక్క 

కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం :  మంత్రి సీతక్క 
  •     చిట్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క 

చిట్యాల, వెలుగు: కోటిమంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. చిట్యాలలో ఎన్నికల ప్రచారంలో  ఆమె పాల్గొని మాట్లాడారు. చిట్యాల పట్టణానికి మహిళల కోసం రైస్ మిల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.  కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ..  పది సంవత్సరాల పాలనలో పేదలకు సరైన ఇండ్ల కేటాయింపులు జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత, తదితరులు పాల్గొన్నారు. 

పంపకాల్లో తేడానే ఆ ఫ్యామిలీలో కొట్లాటలు

యాదాద్రి: పంపకాల్లో తేడా కారణంగానే కేసీఆర్​ ఫ్యామిలీలో కొట్లాటలు రోడ్డెక్కాయని మంత్రి, భువనగిరి పార్లమెంట్​ ఇన్​చార్జి  సీతక్క తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్​తో కలిసి యాదాద్రి జిల్లా మోత్కూరులో ఆమె మాట్లాడారు.    ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.