జెమీమా ఊచకోత: తొలి టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం

జెమీమా ఊచకోత: తొలి టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం

న్యూఢిల్లీ: స్వదేశంలో శ్రీలంకతో జరుగుతోన్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‎లో ఇండియా విమెన్స్ టీమ్ బోణీ కొట్టింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (66) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆదివారం (డిసెంబర్ 21) విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్‌‌‌‌ గెలిచిన తర్వాత తొలిసారి గ్రౌండ్‌‌‌‌లోకి దిగిన ఇండియా అమ్మాయిలు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా అధిపత్యం ప్రదర్శించి శ్రీలంకను 8 వికెట్ల తేడాతో చిత్తు చేశారు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. 

శ్రీలంక బ్యాటర్లలో విషామి గుణరత్నే 39, కెప్టెన్ ఆథపట్టు 15, హాసిని పెరార 20, హర్షితా మాధవి 21 పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో శ్రీచరణి, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ తలో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 14.4 ఓవర్లలోనే టార్గెట్‎ను ఫినిష్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధానా (25) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (15 నాటౌట్), జెమీమా (69 నాటౌట్) ఇండియాను విజయతీరాలకు చేర్చారు. దీంతో 5 మ్యాచుల సిరీస్‎లో 1-0 తేడాతో అధిక్యంలో నిలిచింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‎లో భాగంగా ఇదే వైజాగ్ వేదికగా డిసెంబర్ 23వ తేదీన రెండో మ్యాచ్ జరగనుంది.