ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ కు చెందిన క్షత్రియ సమాజ్ ఎన్నికలు ఈ నెల 28న జరుగుతాయని ఎలక్షన్ ఆఫీసర్ డమాంకర్ రవీందర్ తెలిపారు. టౌన్ లోని లక్ష్మీనారాయణ మందిరంలో సమాజ్ అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు ఆదివారం నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్ష పదవి కోసం బారడ్ గంగా మోహన్, గట్టడి ఆనంద్, పడాల్ మనోజ్ , కార్యదర్శి పదవికి డీకే రాజేశ్, సంతని విజయ్, ఖోడె స్వామి, జెస్సు వినోద్, అల్జాపూర్ సతీశ్, ఘటడి గుండు చంద్రశేఖర్ నామినేషన్ వేశారు.
నామినేషన్ల విత్డ్రా, స్క్రూటినీ అనంతరం ఎన్నికల గుర్తులతో మంగళవారం సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ఎలక్షన్ ఆఫీసర్స్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎలక్షన్ ఆఫీసర్స్ బదాం రాజేందర్, కర్తన్ కిషన్, బోబిడే శ్రీనివాస్, దొండి రవీందర్, దొండి విశ్వనాథ్, ఘట్టడి రాజేశ్, సలహాదారులు దొండి బుడ్డు శంకర్, కర్తన్ మధుసూదన్, సాత్ పుతే శ్రీనివాస్, కర్తన్ హరినారాయణ, సాత్ పుతే తులసీదాస్, బొచ్కర్ దత్తాద్రి, న్యాయ సలహాదారులు అల్జాపూర్ చంద్రప్రకాశ్, ఖాందేశ్ సంగీత, సమాజ్ యూత్ అధ్యక్ష కార్యదర్శులు సాత్ పుతె సంతోష్, దుమాని నీరజ్ పాల్గొన్నారు.
