Jr NTR: జోర్డాన్ షూటింగ్‌కు ఎన్టీఆర్.. స్లిమ్ మేకోవర్‌తో అదరగొడుతున్న యంగ్ టైగర్..!

 Jr NTR: జోర్డాన్ షూటింగ్‌కు ఎన్టీఆర్.. స్లిమ్ మేకోవర్‌తో అదరగొడుతున్న యంగ్ టైగర్..!

మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'డ్రాగన్' . ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్, తారక్ మేకోవర్ కు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రంలోని అత్యంత కీలకమైన షెడ్యూల్ కోసం యంగ్ టైగర్ ఈరోజు ఉదయాన్నే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జోర్డాన్ బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు నెట్టింట వైరల్అవుతున్నాయి. 

షార్ప్ లుక్, స్లిమ్ ఫిజిక్‌తో తారక్ !

 ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్,ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. అయితే షూటింగ్ ప్రారంభంలో ఎన్టీఆర్ లుక్స్ విషయంలో ఫ్యాన్స్ కొంచెం అయోమయానికి గురైనప్పటికీ, ఇప్పుడు బయటకు వస్తున్న ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గడ్డం పెంచి, స్లిమ్‌గా, షార్ప్ ఫిజిక్‌తో కనిపిస్తున్న తారక్ లుక్ 'నెక్స్ట్ లెవల్' అనిపిస్తోందంటున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎంత రగ్గడ్‌గా చూపిస్తారో మనకు తెలిసిందే. 'డ్రాగన్' కోసం తారక్ చేసిన ఈ మేకోవర్ చూస్తుంటే, సినిమాలో ఆయన మాస్ స్వాగ్ థియేటర్లను ఊపేయడం ఖాయమనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. 

జోర్డాన్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్

లేటెస్ట్ సమాచారం ప్రకారం, జోర్డాన్‌లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ప్రముఖ స్టంట్ డైరెక్టర్ చేతన్ డిసౌజా కూడా యూనిట్‌తో చేరారు. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 8 (ఈరోజు) నుంచే తారక్ , టొవినో థామస్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

కథా నేపథ్యం

ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ సాగా అని టాక్. ఈ కథ 1969 కాలానికి చెందిన పీరియాడిక్ డ్రామాగా సాగనుంది. ముఖ్యంగా చైనా, భూటాన్, భారతదేశ సరిహద్దుల్లోని 'గోల్డెన్ ట్రయాంగిల్' ప్రాంతం నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుందని వినికిడి. వేర్వేరు వ్యక్తుల జీవితాలు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యాయి అనే పాయింట్ మీద ప్రశాంత్ నీల్ ఈ భారీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం..

విడుదల ఎప్పుడు?

రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎపిక్ జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో సృష్టించే 'ఎమోషనల్ హై'కి తారక్ నటన తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం అని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి..