పూజ సమాయంలో నేను 6 నిమిషాల్లో 4 లీటర్ల నీరు తాగాను ! నటి సుధా చంద్రన్ షాకింగ్ కామెంట్స్..

 పూజ సమాయంలో నేను 6 నిమిషాల్లో 4 లీటర్ల నీరు తాగాను ! నటి సుధా చంద్రన్ షాకింగ్ కామెంట్స్..

ప్రముఖ నటి సుధా చంద్రన్ ఇంట్లో జరిగిన 'మాతా కీ చౌకీ' అనే  పూజకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆమె పూనకం వచ్చినట్లుగా కనిపించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆమె స్వయంగా స్పందించారు.

అసలేం జరిగిందంటే.. సుధా చంద్రన్ తన అనుభవాన్ని వివరిస్తూ.. ఆ సమయంలో నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు అస్సలు గుర్తులేదు. నా కుటుంబ సభ్యులు చెబితేనే నాకు విషయాలు తెలిశాయి. కేవలం 6 నుంచి 7 నిమిషాలలోనే నేను ఏకంగా 4 లీటర్ల నీటిని తాగానని నా భర్త చెప్పారు. మామూలుగా ఒక మనిషికి ఇది సాధ్యమేనా ? నేను నీటి కోసం చూస్తున్నట్లు  కనిపించానని చెప్పారు.     

అమ్మవారే నాలోకి వచ్చారని నేను చెప్పను, ఎందుకంటే ఆ శక్తిని మనుషులు తట్టుకోలేరు. కానీ ఆమె ఆశీస్సులు నాపై ఉన్నాయని నేను బలంగా నమ్ముతాను అని చెప్పారు. ఆమె వీడియో చూసిన కొందరు సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేశారు. కొందరైతే ఆమె మద్యం తాగి ఉంది అని కూడా విమర్శించారు. వీటిపై  ఆమె సమాధానం కూడా ఇచ్చారు. 

నేను మద్యం తాగి ఉన్నానని కొందరు విమర్శించారు. మరికొందరు ఇదంతా యాక్టింగ్ అని అన్నారు. ఇలాంటివి చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి ? నా నమ్మకాలను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీ నమ్మకాలను నేను ప్రశ్నించనప్పుడు, నా నమ్మకాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మీకు నమ్మకం లేకపోతే వదిలేయండి, కానీ తప్పుగా మాట్లాడకండి అని అన్నారు.