- స్పోర్ట్స్ మీట్ ముగింపు సభలో
- వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కారేపల్లి, వెలుగు : గురుకుల పాఠశాలలతో ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటం కోసం నియోజకవర్గానికి కార్పొరేట్ స్థాయిలో ఒక గురుకుల పాఠశాలను స్థాపించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎల్ సీ అరుణ కుమారి, సింగరేణి సీఐ సాగర్, ఎస్ఐ గోపి, మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ సావిత్రి, శైలజ, అఖిల, సంగీత పాల్గొన్నారు.
