జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలున్నాయి. వీటి గమనం.. ఏరాశిలో సంచరిస్తున్నాయి.. శుభ దృష్టితో ఉన్నాయా.. అశుభ దృష్టితో ఉన్నాయా.. జన్మించినప్పుడు ఉన్న నక్షత్రం ఏమిటి.. ఆనక్షత్రంలో అప్పుడు ఏ గ్రహం సంచరిస్తుంది.. ఇలా అనేక విషయాలను గణించి జ్యోతిష్య నిపుణులు లెక్కలేసి శాంతి చేసుకోవాలని చెబుతుంటారు. నవగ్రహాల్లో ఏ గ్రహానికి శాంతి చేస్తే ఎలాంటిఫలితాలు కలుగుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే.. గ్రహదోషమని భావించాలి. అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యులను సంప్రదించి వారి సూచనల మేరకు, ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు.
- సూర్యుడు: నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.
- కుజుడు: ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. కుజుడిని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు.
- రాహువు: నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు.. కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు.
- గురుడు: ఈయనను బృహస్పతి అంటారు. గురువును ఆరాధిస్తే... వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు.
- శనిగ్రహం : అన్నిగ్రహాల కంటే శని గ్రహం చాలా . శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు.
- బుధుడు: బుద్దిని కలుగుజేస్తాడు బుధుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు.
- కేతువు: ఈయనను పూజిస్తే.. తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని.. దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు.
- శుక్రుడు: శుక్రాచార్యుడు. సంపదను..ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు. సంతానాన్ని ఇవ్వగలుగుతాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం జ్యోతిష్య పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
►ALSO READ | జ్యోతిష్యం: ఇంటి ముందు రంగోలి ముగ్గులు ... గ్రహదోషనివారణ .. నెగిటివ్ ఎనర్జీ దూరం !
