యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసం కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. ప్రత్యర్థి ఎవరైనా చెలరేగి ఆడడం కామన్. ఐపీఎల్ 2025 నుంచి కొనసాగుతున్న ఈ 14 ఏళ్ళ కుర్రాడి విధ్వంసం ఇప్పటికీ తగ్గలేదు. ఓపెనర్ గా బరిలోకి దిగిన వెంటనే కొత్త బంతితో సంబంధం లేకుండా.. స్టార్ బౌలర్ తో పని లేకుండా తొలి బంతి నుంచే బౌండరీల వర్షం కురించడం సూర్యవంశీకే చెల్లింది. తాజాగా ఈ టీనేజ్ కుర్రాడు అండర్-19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో తుఫాన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు.
బుధవారం (ఫిబ్రవరి 4) హరారే వేదికగా హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ కు తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఇన్నింగ్స్ 10 ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి సూర్య ఔట్ కావడంతో అతని గ్రేట్ ఇన్నింగ్స్ కు ముగింపు పడింది. సూర్యవంశీ ధాటికి టీమిండియా తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. వైభవ్ ఇచ్చిన ఆరంభంతో ఇండియా ఛేజింగ్ ఈజీ అయింది.
ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. భారత జట్టు విజయానికి 36 ఓవర్లలో 189 పరుగులు అవసరం. చేతిలో 9 వికెట్లు ఉండడంతో టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తుంది. ఆయుష్ మాత్రే (17), జార్జ్ (35) క్రీజ్ లో ఉన్నారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఫైసల్ షినోజాడా 104 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఉజైరుల్లా నియాజై 101 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియన్ బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు.
????. ????????. ?????.
— Star Sports (@StarSportsIndia) February 4, 2026
Vaibhav Sooryavanshi goes full throttle in the SEMI-FINAL chase! ?#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG ? LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/skcIOVMznz
