తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28.
- ఎలిజిబిలిటీ: పదోతరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- తెలుగు / ఉర్దూ / హిందీ లేదా ఇంగ్లిష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
- ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ (ఎంఎంవీ) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- కారు నడపడంలో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: 18 నుంచి 46 ఏండ్ల మధ్యలో జన్మించిన వారై ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఖాళీలు: 09 (డ్రైవర్).
- అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 07.
- అప్లికేషన్ ఫీజు: రూ.500. ది రిజిస్ట్రార్ (రిక్రూట్ మెంట్), హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ ది తెలంగాణ పేరిట చెల్లించాల్సి ఉంటుంది.
- లాస్ట్ డేట్: ఫిబ్రవరి 28.
- పూర్తి వివరాలకు https://tshc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
సెలెక్షన్ ప్రాసెస్:
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ (డ్రైవింగ్‌లో నైపుణ్య పరీక్ష) ఉంటుంది. స్కిల్ టెస్టులో అర్హత సాధించాలంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ 45 శాతం, బీసీలు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. స్కిల్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను మౌఖిక ఇంటర్వ్యూ కోసం అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యను అనుసరించి 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు.
►ALSO READ | THSTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు ఇవే
