వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ అనగానే ఆస్ట్రేలియాకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. ద్వైపాక్షిక సిరీస్ లు ఎలా ఆడినా వరల్డ్ లో తమలోని మరో కోణాన్ని చూపిస్తారు. ఐసీసీ ట్రోఫీలంటే ఈజీగా గెలిచే ఆస్ట్రేలియా మరో ట్రోఫీపై కన్నేసింది. ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో ఈ టోర్నీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో ఆతిధ్య జట్టు ఇండియాతో పాటు ఆస్ట్రేలియా కూడా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.
షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా తమ గ్రూప్ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడాల్సి ఉంది. దీంతో ఇప్పటికే ఆసీస్ జట్టు కొలంబోకు చేరుకుంది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో వరల్డ్ కప్ పోరును ఆస్ట్రేలియా స్టార్ట్ చేయనుంది. ఫిబ్రవరి 13న జింబాబ్వే, ఫిబ్రవరి 16న శ్రీలంక, ఫిబ్రవరి 20న ఒమన్‌తో తలపడనుంది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఆస్ట్రేలియా ఉన్న గ్రూప్-బి లో అన్ని చిన్న జట్లే ఉన్నాయి. ప్రతి గ్రూప్ లో రెండు పెద్ద జట్లు ఉన్నప్పటికి గ్రూప్-బి లో మాత్రం ఆస్ట్రేలియాకు తిరుగులేకుండా పోయింది. జింబాబ్వే, ఒమన్,ఐర్లాండ్ జట్లు ఆసీస్ కు కనీస పోటీ ఇచ్చే దశలో లేవు. శ్రీలంక కూడా ఇటీవలే ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ఓడిపోయి ఢీలా పడింది.
ALSO READ : ఛేజింగ్ టెన్షన్ టెన్షన్: బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆఫ్ఘనిస్తాన్..
స్థాయికి తగ్గట్టుగా ఆడితే గ్రూప్ 'బి' లో ఆస్ట్రేలియా ఈజీగా నాలుగు మ్యాచ్ లు గెలిచి అలవోకగా సూపర్-8 బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేలా ఉంది. అసలే ఐసీసీ టోర్నీలంటే చెలరేగి ఆడే ఆస్ట్రేలియాకు తమ గ్రూప్ లో చిన్న జట్లు వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ గ్రూప్ పై క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవలే శ్రీలంకలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తమ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. స్టార్ ఆటగాళ్లు స్టార్క్, కమ్మిన్స్ అందుబాటులో లేకపోయినా ఆస్ట్రేలియా జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తుంది.
2026, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా శనివారం (జనవరి 31) తమ తుది జట్టును ప్రకటించింది. 15 మంది పేర్లతో కూడిన టీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ మెగా టోర్నమెంట్ కోసం ఆసీస్ ఇప్పటికే తమ తాత్కాలిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వివిధ కారణాలతో తాత్కాలిక జట్టులో పలు మార్పులు చేస్తూ శనివారం తుది జట్టును ప్రకటించింది.
ALSO READ : సూర్య సేనకు ధోనీ ముందు జాగ్రత్త
ఈ టీమ్‌లో ప్రధానంగా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వెన్ను గాయం కారణంగా పాట్ కమ్మిన్స్ మెగా టోర్నీకి దూరం కాగా అతడి స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను ఎంపిక చేసింది. ఇక, తాత్కాలిక జట్టులో ఉన్న మాట్ షార్ట్‌ను తప్పించి అతని స్థానంలో మాట్ రెన్షాను జట్టులోకి తీసుకుంది. సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
2026 టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా స్క్వాడ్:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
