Under 19 World Cup 2026: ఛేజింగ్ టెన్షన్ టెన్షన్: బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్‌కు వెళ్లాలంటే టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Under 19 World Cup 2026: ఛేజింగ్ టెన్షన్ టెన్షన్: బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్‌కు వెళ్లాలంటే టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

అండర్-19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా బౌలర్లు తడబడ్డారు. పసికూన ఆఫ్ఘనిస్తాన్ పై చెత్త బౌలింగ్ తో భారీ స్కోర్ సమర్పించుకున్నారు. బుధవారం (ఫిబ్రవరి 4) హరారే వేదికగా హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఫైసల్ షినోజాడా 104 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఉజైరుల్లా నియాజై 101 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియన్ బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు

ఓపెనర్లు శుభారంభం:

ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ఖలీద్ అహ్మద్జాయ్, ఉస్మాన్ సదాత్ తొలి వికెట్ కు 53 పరుగులు జోడించారు. ఖలీద్ అహ్మద్జాయ్ పరుగులు చేసే ప్రయత్నం చేయగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ సదాత్ క్రీజ్ లో కుదురుకునేందుకు సమయం తీసుకున్నాడు. తొలి వికెట్ కు 53 పరుగులు జోడించిన తర్వాత ఈ జోడీని దీపేష్ దేవేంద్రన్ విడగొట్టాడు. 31 పరుగులు చేసిన ఖలీద్ అహ్మద్జాయ్ ను ఔట్ చేసి ఇండియాకు తొలి వికెట్ అందించాడు. 

షినోజాడా, ఉజైరుల్లా నియాజై సెంచరీల మోత: 

ఈ దశలో ఫైసల్ షినోజాడా, ఉస్మాన్ సదాత్ మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. రెండో వికెట్ కు 64 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఉన్నంత సేపు వేగంగా ఆడడంలో విఫలమైన ఉస్మాన్ సదాత్ 70 బంతుల్లో 39 పరుగువులు చేసి పెవిలియన్ కు చేరాడు. 117 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత అద్భుతంగా ఆడింది. వచ్చిన మంచి ఆరంభాన్ని ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు వేగంగా ఆడారు. ఈ క్రమంలో ఫైసల్ షినోజాడా తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఉజైరుల్లా నియాజై తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.   

సెంచరీ హీరో ఫైసల్ షినోజాడా (104) ఔటైనా.. చివరి వరకు క్రీజ్ లో ఉండి ఉజైరుల్లా నియాజై కూడా సెంచరీ మార్క్ అందుకొని జట్టు స్కోర్ ను 300 పరుగులు దాటించాడు. ఫైసల్ షినోజాడా, ఉజైరుల్లా నియాజై  వికెట్ కు ఏకంగా 148 పరుగులు జోడించడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది.