ధనుర్మాసం కొనసాగుతుంది. తెల్లవారుజామున ఆడపిల్లల హడావిడి అంతా కాదు.. ముగ్గు గిన్నెలు.. రంగోలీ లతో సందడి సందడి చేసేశారు. హిందూ సంప్రదాయంలో ధనుర్మాసం ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు నెలవు. ఈ మాసంలో తెల్లవారుజామునే వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతుంటాయి. ఈ ముగ్గులు కేవలం ఇంటి అందాన్ని పెంచడం కోసం మాత్రమే కాదు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. జాతకంలో గ్రహదోషాలు నివారణఅవుతాయని... ఇంకా నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఈ విషయాల గురించి.. ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
ధనుర్మాసంలో ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వేయాలి? ఇది కేవలం సాంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం ఆచారం జ్యోతిష్య పరంగా చాలా కారణాలున్నాయి. ముగ్గు వేయడం అనేది ఒక కళ మాత్రమే కాదు... అది మన సంప్రదాయంలో భాగం... మన ఇంటికి, కుటుంబానికి రక్షణ కవచంలాంటిదని పండితులు చెబుతారు.
ధనుర్మాసంలో రంగోలి ముగ్గులు కేవలం ఇంటి అందానికే కాదు, గ్రహ దోష నివారణకు, నరదృష్టి తొలగింపునకు, సానుకూల శక్తిని ఆకర్షించడానికి తోడ్పడతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. బియ్యం పిండి, సహజ రంగులతో వేసే సంప్రదాయ ముగ్గులు చాలా శక్తిని కలిగి ఉంటాయి. నవగ్రహాలకు సంబంధించినవి.. గ్రహ దోషాలను నివారించడంలో సహాయపడతాయి.ముగ్గులు వేయడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోయి, ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా నిరోధిస్తాయి.
ముగ్గులను బియ్యపు పిండితో వేయడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించడం (భూత యజ్ఞం) ద్వారా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో బియ్యపు పిండితో ముగ్గులు వేసేవారు. మన చుట్టూ ఉన్న అన్ని జీవులు మనలాంటివే అని భావించే మతం మనది. కాబట్టి, చుట్టుపక్కల జీవుల కడుపు నింపిన తర్వాత, ఉదయాన్నే మన గురించి ఆలోచించడం మాకు అలవాటుగా ఉండేది.
►ALSO READ | ఇన్ స్టా రీల్స్ కోసం.. నయా ఫీచర్స్
చుట్టుపక్కల ఉన్న పక్షులు, కాకి, ఉడుత, చీమ, పిచ్చుక, పావురం తదితర కీటకాల కడుపు నింపేందుకు ఇంటి పెరట్లో, ఇంటి ముందు బియ్యపు పిండి ముగ్గులు వేసేవారు. ముగ్గు అనేది అన్ని జీవులతో పంచుకునే స్ఫూర్తికి అద్దంవంటిది. ఇలా చేయడం వల్ల సేవతో పాటు, గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. జీవులకు ఆహార దానం చేస్తే గత జన్మల పాపాలు నశిస్తాయి. ఇంకా నవగ్రహాల వలన కలిగే దోషాలకు మంచి పరిష్కారమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ ముగ్గులు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి చిహ్నం. ఇంటి ముందర ముగ్గు ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ, లక్ష్మీప్రదంగా ఉంటుందని నమ్మకం. నెగటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి) లోపలికి రాకుండా ఈ ముగ్గులు అడ్డుకుంటాయని శాస్త్రం చెబుతోంది. ముగ్గు శుభప్రదమైన ప్రారంభానికి సంకేతమని చెబుతున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
