హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ పుణ్య తిథి రోజున విష్ణువును పూజిస్తారు. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మాఘమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి. ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఫిబ్రవరి 13 వ తేది వచ్చింది. ఆ రోజున ఏదేవుడిని పూజించాలి? ఏ మంత్రాలు చదవాలి. మొదలగు విషయాలను ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం .
.మాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి ( ఫిబ్రవరి 13) అంటారు.. ఏకాదశికి హిందూమతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వ్రతం పాటించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున మహా విష్ణువుని పూజించి ఉపవాసం ఉండటం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మరణం తర్వాత మోక్షం కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం.
శుభ ముహూర్తం
విజయ ఏకాదశి తిథి ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 02:25 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం విజయ ఏకాదశి ఫిబ్రవరి 13, శుక్రవారం నాడు జరుపుకుంటారు.
పూజా సమయం
విజయ ఏకాదశి 2026 శుభ సమయం: ఫిబ్రవరి 13 ఉదయం 6.26 నుండి 9.15 గంటల వరకు. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం ఉపవాసం విరమించాలి. భక్తితో విష్ణువుని ఆ రోజు ఆరాధిస్తే ఆనందంగా ఉండచ్చు, విజయాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
విజయ ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రాలు
- ‘ఓం నారాయణాయ లక్ష్మీ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల మంచి ఉద్యోగం పొందుతారు.
- ‘ఓం సీతాపతే రామ్ రామాయ నమః’ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.
- ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని పాటించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.
పవిత్రమైన విజయ ఏకాదశి రోజున నారాయణుని పూజించి భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి. శ్రీకృష్ణ భగవానుడు విజయ ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరైతే విజయ ఏకాదశిని నిజమైన భక్తితో ఆచరిస్తారో వారు మహా విష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతాడు. ఆచారాల ప్రకారం విజయ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు మరణానంతరం విష్ణులోకం అంటే వైకుంఠ ధామం పొందుతారు.విజయ ఏకాదశి రోజున నిష్టతో, భక్తితో ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు భజనలు , కీర్తనలు పఠించడం, దానధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | Health Alert: ఆఫీసుల్లో స్నాక్స్.. చిరుతిళ్లు కర కర నములుతున్నారా..! బరువు పెరుగుతారు జాగ్రత్త..!
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
