ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? టీవీ చూస్తూ చిప్స్ అని... పకోడీలనీ ఏవేవో నమిలేస్తారు. అవును కదా! మరి ఆ అలవాటు ఆఫీసు దాకా వెళ్లిందా? వెళ్లే ఉంటుంది? పని ఒత్తిడో లేక ఫ్రెండ్స్ కు కంపెనీ గానో.... బిస్కెట్లనీ, చాక్లెట్లనీ టేస్ట్ చేస్తుంటారు చాలామంది. అయితే ఇప్పుడు ఆ అలవాటే కొంప ముంచుతోందట. ఎలాగంటారా? ఇదిగో...
ఆఫీసుల్లో ఓ పక్క పని చేస్తూనే... మరోపక్క స్నాక్స్ తింటుంటారు చాలామంది. అందులో కేకులు, పిజ్జాలు, కుకీలు, బిస్కెట్లు, కూల్ డ్రింక్ లు, క్యాండీలు... ఇలా ఏదో ఒకటి తింటూ ఉంటారు. అయితే దానివల్ల కొవ్వు పెరిగి ఉద్యోగులంతా బరువు పెరుగుతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది.
కొన్ని ఆఫీసుల్లో అయితే యాజమాన్యమే స్నాక్స్ ఉచితంగా సర్వ్ చేస్తోంది. అక్కడ కూడా చాలామంది ఉద్యోగు లు అధిక బరువుతో బాధపడుతున్నారట.
సర్వే ఏం చెబుతోంది?
కొందరు పరిశోధకులు అమెరికాలోని ఉద్యో గులపై ఈ అధ్యయనం చేశారు. వాళ్లు రోజులో ఎన్నిసార్లు, ఎలాంటి ఆహార పదార్థాలు తిం టున్నారన్న వివరాలు సేకరించారు. అయితే అస్నాక్స్ లో ఎక్కువగా ఉప్పు, చక్కెర, కొవ్వు, జీరో క్యాలరీలే ఉన్నాయి. వారం మొత్తంలో సగటు ఉద్యోగి 1300 క్యాలరీలు తీసుకుంటు న్నట్లు నివేదికలో తెలిసింది. పరిశోధకులు ఈ అధ్యయనాన్ని 'జర్నల్ ఆఫ్ అకాడమీ ఆఫ్మ్యాట్రిషన్ అండ్ డైటెటిక్స్ 'లో ప్రచురించారు.
►ALSO READ | Good Health: ఐదు నిమిషాల వ్యాయామం.. గుండె ఆరోగ్యానికి అవసరం..
అలాగే చిరుతిళ్లను ఉచితంగా అందిస్తున్న కంపెనీల్లోనే కాదు, ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ తినేవాళ్లు కూడా కూడా బరువు పెరిగిపోతు న్నారని స్టీఫన్ అనే పరిశోధకుడు తెలిపాడు. ఇంతకు ముందు కూడా అతను ఇదే అంశంపై అధ్యయనం చేశాడు. అప్పుడు 5,200 మంది ఉద్యోగులను సంప్రదించి, వారం రోజులుగా వాళ్లు ఆఫీసు వేళల్లో ఏం తింటున్నారు? ఎంత తింటున్నారు? వంటి విషయాలను సేకరించా డు. అప్పుడు కూడా అధిక బరువుకు దారి తీసే జీరో క్యాలరీలనే తింటున్నట్లు తన నివేదికలో వెల్లడించాడు. అందుకే వీలైనంత వరకు ఆఫీసు ల్లో స్నాక్స్ తినకపోవడమే మేలు అంటున్నారు. ఆరోగ్య నిపుణులు
–వెలుగు,లైఫ్–
