ఈగల్ టీం స్పెషల్ డ్రైవ్.. కేవలం 4 రోజుల్లోనే 75 మంది పరారీలో ఉన్న నిందితులు అరెస్ట్..

ఈగల్ టీం స్పెషల్ డ్రైవ్.. కేవలం 4 రోజుల్లోనే 75 మంది పరారీలో ఉన్న నిందితులు అరెస్ట్..

తెలంగాణ ఈగల్ టీం స్పెషల్ డ్రైవ్ లో రికార్డు స్థాయిలో పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేస్తోంది. చిన్న క్లూ ఉన్నా చాలు.. మెరుపు దాడులు చేసి అదుపులోకి తీసుకుని నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్స్, డ్రగ్స్) కేసులపై తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ గురించిన వివరాలు వెల్లడించారు. 

పరారీలో ఉన్న నిందితులపై ఈగల్ టీం మెరుపు దాడులు నిర్వహిస్తోంది. డీజీపీ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ఈగల్ టీం.. NDPS కేసుల్లో దేశవ్యాప్తంగా 3,228 మంది నిందితులు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 1,278 మంది తెలంగాణకు చెందినవారిగా నిర్ధారించారు. 

2026 జనవరి 29 నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించగా.. 4 రోజుల్లోనే 75 మంది పరారీలో నిందితులు అరెస్ట్ చేసి రికార్డు సృష్టించారు. అరెస్టయిన వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.  డ్రగ్స్ వినియోగానికి సంబంధించి కుటుంబ సభ్యుల సమక్షంలో పారదర్శకంగా మూత్ర పరీక్షలు నిర్వహించారు. అరెస్ట్ అయిన  75 మందిలో 38 మందికి నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

ఈగల్ టీం స్పెషల్ డ్రైవ్స్ ఫిబ్రవరి నెలంతా కొనసాగనున్న తెలిపారు. ఎన్‌డీపీఎస్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈగల్ టీం పనిచేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రగ్స్ సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. అన్ని యూనిట్ అధికారులకు ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించాలంటూ ఈ సందర్భంగా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.