జ్యోతిష్యం : కుంభరాశిలోకి నాలుగు పెద్ద గ్రహాలు.. బుధాదిత్య రాజయోగం ఎవరెవరికి అంటే..!

జ్యోతిష్యం : కుంభరాశిలోకి నాలుగు పెద్ద గ్రహాలు.. బుధాదిత్య రాజయోగం ఎవరెవరికి అంటే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.  గ్రహ సంచారంలో మార్పులు వచ్చినప్పుడు మన జీవితంపై వాటి ప్రభావం ఉంటుంది.  అందుకే ఒక్కోసారి.. సుఖాలు.. మరో సారి కష్టాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   ఫిబ్రవరిలో నాలుగుగ్రహాలు  శని భగవానుడి జన్మరాశి అయిన కుంభ రాశిలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు, కుజుడు కలిసి సంచారం చేయనున్నాయి.   ఈ నాలుగు పెద్ద గ్రహాలు కలిసి సంచారం చేయడం వలన లక్ష్మీ నారాయణ రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, ఆదిత్య మంగళ యోగం వంటి శుభ యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  దీని ప్రభావంతో  ఐదు రాశుల వారికి ( మేషరాశి.. మిథునరాశి.. తులారాశి..మకర రాశి.. కుంభరాశి) అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల  గురించి తెలుసుకుందాం. . .!

కుంభరాశిలో  నాలుగు పెద్ద గ్రహాలు కలిసి సంచరించడం వలన ఏర్పడే యోగా ప్రభావంతో  మేష, మిథున, తులా, మకర, కుంభ రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి రాశికి ఈ ప్రభావం వేర్వేరు రూపాల్లో వ్యక్తమవుతుందని జ్యోతిష్యులు వివరిస్తున్నారు.

మేష రాశి: ఈ రాశి వారికి  ఫిబ్రవరి నెల  కీలకంగా మారే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.   నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి.ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు పెరుగుతుంది.  కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి..  సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మిథున రాశి :  ఈ రాశి వారికి  కొంతకాలంగా ఎదురవుతున్న కష్టాలకు ఇప్పుడు ముగింపు దశ ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు. వృత్తి పరంగా చేసిన ప్రయత్నాలు ఫలించడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.  ఫిబ్రవరి నెలలో ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.  ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త బాధ్యతలతో పాటు మంచి అవకాశాలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి పదోన్నతులు  పొందే  అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల లాభాలు పొందే పరిస్థితి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో కూడా అనుకూల పరిణామాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. . చాలా రోజులుగా వాయిదా పడుతున్న పనులు ఈ నెలలో పూర్తి కావడం వల్ల మానసికంగా సంతృప్తి పొందే అవకాశం ఉంది.వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన అవకాశాలున్నాయి. 

తులారాశి: ఈరాశి వారికి అదృష్టం తోడై పెండింగ్‌లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వృత్తి .. వ్యాపారస్తులకు ఆదాయం భారీగా పెరుగుతుంది.ఏ ప్రయత్నం తలపెట్టినా కలసి వస్తుంది. అనేక విధాలుగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పెళ్లికోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు

మకర రాశి..  ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపార వర్గాలకు ఈ నెల అత్యంత ఫలవంతంగా ఉండబోతోందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రాధాన్యత బాగా పెరుగుతుంది.  సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. . నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు.

కుంభ రాశి: ఈ రాశి వారికి  దీర్ఘకాలంగా నిలిచిపోయిన విషయాల్లో కదలిక వస్తుంది. న్యాయపరమైన వ్యవహారాలు, అధికార సంబంధిత పనులు లేదా ఇతర సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి.   ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ కాలం అనుకూలంగా మారవచ్చు. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా ఈ యోగంతో కలిసివస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.