ఇన్ స్టా రీల్స్ కోసం.. నయా ఫీచర్స్

ఇన్ స్టా రీల్స్ కోసం.. నయా ఫీచర్స్
  • ఆటోస్క్రోల్​ ఆప్షన్​తో  చేతివేళ్లకు పనిలేదు

ఇన్​స్టాగ్రామ్​లో మరో కొత్త ఫీచర్​ కోసం టెస్టింగ్​ మొదలైంది. రీల్స్ చూసే వారి అలవాటును మార్చే ఫీచర్​ ఇది. ఈ మధ్య ప్రతి ఒక్కరూ రీల్స్​ను తెగ చూస్తున్నారు. గంటలో పదుల సంఖ్యలో రీల్స్​ చూసే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ అలవాటు కాస్త వ్యసనంగా మారే చాన్స్ ఉంది. పైగా ఫోన్​ని చేతిలో పెట్టుకుని వేలితో పైకి, కిందకి స్క్రోల్​ చేస్తూ ఎక్కువ సమయం రీల్స్​ చూడడం కూడా మంచిది కాదు. 

కాబట్టి ఒక రీల్ అయిపోయిన వెంటనే మరో రీల్​ దానంతటదే వచ్చేలా కొత్త ఫీచర్​ను తీసుకురాబోతోంది కంపెనీ. పైగా రీల్స్​ కంటెంట్​ ఎండ్​లెస్​గా వస్తూనే ఉంటుంది. కొన్ని యూజర్​ ప్రిఫరెన్స్​తో ఉంటే మరికొన్ని వైరల్​ వీడియోలు వస్తుంటాయి. అలా కాసేపు రీల్స్​ చూస్తూ రిలాక్స్​ అవ్వాలనుకునేవాళ్లకు ఈ ఆటోస్క్రోల్​ ఫీచర్​ బాగా పనికొస్తుంది. దీనివల్ల తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్​ చూడొచ్చు. ఈ ఫీచర్​లో రీల్స్​ కుడివైపు కింద ఉన్న హాంబర్గర్​ మెనూలో ఈ ఆప్షన్​ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత రీల్స్​ ఆటో స్క్రోల్​ మోడ్​లో కంటిన్యూగా వస్తుంటాయి.  

►ALSO READ | వయసుమీద పడుతున్నా యంగ్‌‌‌‌గా కనిపించాలంటే..ఈ అలవాట్లు చాలా ముఖ్యం